ప్రపంచంలోని కఠినమై చట్టాలు ఇవే..! కాక్టస్‌ను కత్తిరిస్తే 25 ఏళ్ల పాటు జైలు శిక్ష..

-

మన దగ్గర పెద్దగా కఠినమైన చట్టాలు ఉండవు..ఉన్నవే పూర్తిగా అమలు చేయరనే భావన కూడా మనలో చాలామందికి ఉంటుంది. కానీ కొన్ని దేశాల్లో ఉండే చట్టాలు చూస్తే.. మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. అవి నిజానికి చాలా కామన్‌ విషయాలని మనకు అనిపిస్తుంది. కత్తర్‌లో రూల్స్‌లో చాలా స్ట్రిట్‌గా ఉంటాయి. అలాంటి కఠినమైన చట్టాలు, అక్కడ ఏం చేస్తే నేరమో చూద్దామా..! ఎందుకంటే.. మీరు అవి చూస్తే.. అరే ఇది కూడా తప్పేనే అనుకుంటారు..!

ఎడారి ప్రాంతాల్లో కాక్టస్‌ను కత్తిరించడం చాలా సాధారణమైన విషయం. అయితే అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఉన్న ఎడారిలో కాక్టస్‌ను నరికితే మాత్రం జైలు శిక్ష తప్పదు. 25 ఏళ్లపాటు జైలు శిక్ష విధిస్తారాట..కలేజా సినిమాలో.. అలీ తెలియక ఏదో పువ్వును కోస్తే ఎంత రచ్చచేస్తారో గుర్తుందిగా.. అలాంటిదే ఇది కూడా.!

ఆస్ట్రేలియాలో హోమింగ్ పావురాలను పట్టుకోవడం నిషేధం. ఎవరైనా వారిని పట్టుకున్నా లేదా జైలులో పెడితే వారికి జైలు శిక్ష లేదా రూ. 20,000 జరిమానా విధిస్తారు.

స్విట్జర్లాండ్‌లో మీరు రాత్రి 10 గంటల తర్వాత టాయిలెట్‌ను ఫ్లష్ చేస్తే మీకు జైలు శిక్ష విధిస్తారు..

స్టోలాండ్ ఒక ప్రత్యేకమైన నృత్యం ఉంటుంది. దీనిలో పురుషులు కూడా అమ్మాయిల వలె స్కర్టులు వేసుకుంటారు. కానీ ఇతర దేశాల్లో పురుషులు స్కర్టులు ధరించడం తప్పుగా పరిగణించబడుతుంది. ఇటలీలో పురుషులు బహిరంగంగా స్కర్టులు ధరిస్తే వారు జైలుకు వెళ్లవలసి ఉంటుంది.

ఈజిప్ట్‌లో బెల్లీ డ్యాన్స్ మహిళలకు మాత్రమే వేయాలి.. ఎక్కడో ఒక చోట మగవారు తమాషాగా అయినా కూడా పబ్లిక్ ప్లేస్‌లో బెల్లీ డ్యాన్స్ చేస్తే జైలుకు వెళ్లే అవకాశం ఉంది.

ఇలాంటి చట్టాలు ఇంకా ప్రపంచ వ్యాప్తంగా చాలానే ఉన్నాయి.. మన దగ్గర టీవీ షోస్‌ కోసం.. అబ్బాయిలే అమ్మాయిల బట్టలు వేసుకుంటారు.. ఇక్కడ అది నేరం కాదు. కానీ ఒక సారి మన కమెడియన్స్‌ను వేరే దేశంలో ఎయిర్‌పోర్టులో పట్టుకున్నారు. అబ్బాయి అయి ఉండి అన్నీ అమ్మాయిలకు సంబంధించిన బట్టలు క్యారీ చేస్తున్నారని. సో.. దేశం దాటేముందు.. మనం ఎక్కడికి వెళ్తున్నాం, అక్కడ ఏమైనా కఠినమైన రూల్స్‌ ఉన్నాయా అనేది తెలుసుకోని వెళ్లడం ఉత్తమం.!

Read more RELATED
Recommended to you

Latest news