రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు రాష్ట్రాలపై వరుణుడు తన ప్రకోపాన్ని చూపిస్తున్నాడు. కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా కురుస్తుండటంతో సామాన్యలు అల్లాడుతున్నారు. ఎక్కడికక్కడ వాగులు, చెరువులు, ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో వర్షాప్రభావం మరింత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. కళింగపట్నం వద్ద తుఫాన్ తీరం దాటడంతో మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ క్రమంలోనే ఏపీలో అత్యవసర వైద్య సేవల కోసం ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా గర్భిణులు, పాటు కాటు, విద్యుత్ షాక్‌లకు గురైన వారికి ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఎమర్జెన్సీ సేవల కోసం 90323 84168, 73864 51239,83748 93549 నెంబర్లకు కాల్ చేయాలని ప్రభుత్వం సూచించింది. సెప్టెంబర్ 3 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.