తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ తరుణంలోనే… 10 గంటలుగా ఓ బస్సులోనే ప్రయాణికులు చిక్కుకున్నారు. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వేములవాడ నుంచి మహబూబాబాద్కు శనివారం రాత్రి బయల్దేరిన RTC బస్సు వరంగల్ జిల్లా వెంకటాపురం-తోపనపల్లి మధ్య నిలిచిపోయింది.
వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో 10 గంటలుగా బస్సులోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా లేక చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. అధికారులు స్పందించి తమను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలని కోరారు. వరద నీరు ముంచెత్తడంతో ఎటు వెళ్లలేని స్థితిలో ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులు ఉన్నారు.
https://x.com/telanganaawaaz/status/1830105559443358138