హిమాచల్ లో రికార్డ్ స్థాయి చలి.. ఏకంగా మైనస్ 6.6 !

-

హిమాచల్ ప్రదేశ్ లో చలి వణికిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఫేమస్ టూరిస్ట్ హాట్‌స్పాట్ మనాలిలో మైనస్ 1.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇక అదే రాష్ట్రంలో కీలాంగ్ లో మంగళవారం మైనస్ 6.6 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. దీంతో ఈ ప్రదేశమే రాష్ట్రంలో అతి శీతల ప్రదేశం గా ఉందని ఆ రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపింది. కిన్నౌర్ కల్పాలో మైనస్ 2.1 డిగ్రీల సెల్సియస్, డల్హౌసీ, సిమ్లాలో వరుసగా 3.6, 4.8 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయని సిమ్లా వాతావరణ కేంద్రం డైరెక్టర్ మన్మోహన్ సింగ్ తెలిపారు.

లాహౌల్ అనే గిరిజన జిల్లా మరియు స్పితి యొక్క పరిపాలనా కేంద్రం కీలాంగ్ లో మైనస్ 6.6 డిగ్రీల సెల్సియస్ నమోదయి అతి శీతల ప్రదేశం గా ఉందని అని పేర్కొన్నారు. కీలాంగ్ మరియు కల్ప వంటి రాష్ట్రంలో ఉన్న హై రీచ్ లు వరుసగా 2 సెం.మీ మరియు 0.4 సెం.మీ హిమపాతం నమోదయింది.  మరో పక్క నహన్‌తో సహా అనేక ఇతర ప్రాంతాల్లో 22.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ మన్మోహన్ సింగ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news