KGF-2 MAY I COME IN : కేజీఎఫ్ -2 నుంచి బిగ్ అప్‌డేట్.. ట్రైల‌ర్ రెడీ

-

కేజీఎఫ్ – 2 నుంచి బిగ్ అప్ డేట్ వ‌చ్చింది. దేశ వ్యాప్తంగా కేజీఎఫ్ అభిమానులు ఎదురు చూస్తున్న కేజీఎఫ్ – 2 ట్రైల‌ర్ ముహూర్తం ఖ‌రారు అయింది. రేపు సాయంత్రం 6:40 గంట‌ల‌కు కేజీఎఫ్ – 2 ట్రైల‌ర్ విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసింది. కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్.. త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా.. ట్రైల‌ర్ గురించి అప్ డేట్ ఇచ్చారు.

మ‌రో 24 గంట‌ల్లో కేజీఎఫ్ – 2 ట్రైల‌ర్ రాబోతుందని ప్ర‌క‌టన చేశారు.అంతే కాకుండా.. రాఖీ భాయ్ వీడియో ను కూడా విడుద‌ల చేశారు. MAY I COME IN అంటూ రాఖీ భాయ్ చెప్పే డైలాగ్ తో ఈ వీడియో ఉంది. కాగ హీరో య‌శ్.. కేజీఎఫ్ సినిమాతో ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు.

ఎలాంటి అంచ‌నాలు లేకుండా.. కేజీఎఫ్ – 1 విడుద‌ల అయి ప్ర‌పంచ వ్యాపంగా సంచ‌ల‌నాలు సృష్టించింది. కాగ ఇప్పుడు అభిమానులు అంద‌రూ కేజీఎఫ్ – 2 కోసం వెయ్యి కళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. అయితే ట్రైల‌ర్ కోసం మ వేచి చూద్ధం.

Read more RELATED
Recommended to you

Latest news