మనం ఒకరి తో మంచిగా ఉంటే వాళ్లు కూడా మనతో మంచిగానే ఉంటారు. మనం ఒకరితో సరిగ్గా ప్రవర్తించకపోతే వాళ్లు కూడా మన వైపు అలానే ఉంటారు అయితే నిజానికి ఎప్పుడూ కూడా అందర్నీ స్నేహితుల్ని చేసుకోవాలి తప్ప అనవసరంగా కొట్లాటకు వెళ్ళకూడదు.
ఆచార్య చాణక్య స్నేహపూర్వకంగా ఎలా మెలగాలి అనే దాని గురించి చెప్పారు. అలానే ఈ విధంగా ఫాలో అయితే కచ్చితంగా గొడవలు ఉండవని అందరూ కూడా స్నేహంగా ఉంటారని చెప్పారు. అయితే అందరితో స్నేహంగా ఎలా ఉండాలి..?. గొడవలు ఇబ్బందులు లేకుండా ఏ విధంగా అనుసరించాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
గొడవలకు దూరంగా ఉండండి:
ఎప్పుడూ కూడా ఇతరులతో గొడవ పడకండి. గొడవలు పడటం వల్ల ఇబ్బందులు వస్తాయి. అందుకని మీరు కొంచెం సర్దుబాటు చేసుకుని సమస్య ఉంటే పరిష్కరించుకోండి. అంతేతప్ప గొడవలు కి వెళ్ళకండి. ఇలా కనుక మీరు నడుచుకున్నారు అంటే సమస్యలు ఉండవు.
వారి స్వభావాన్ని అర్థం చేసుకోండి:
మీరు ఇతరుల స్వభావాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎదుట వారి బలాన్ని కీర్తిని మీరు ప్రశంసించండి. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఉత్సాహం వస్తుంది. మీతో మంచిగా ఉంటారు.
గౌరవం ఇవ్వండి:
మీరు అందర్నీ కూడా గౌరవంగా చూసుకోండి. ఇతరులు మీ మాట వినాలి అనుకుంటే మీరు కూడా వాళ్ళ మాట వినాలి ఇలా చేస్తే గౌరవం పెరుగుతుంది.
తప్పుని అంగీకరించడం మర్చిపోకండి:
మీరు ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా దానిని అంగీకరించండి. దీని వల్ల మీ పట్ల వారికి సానుభూతి పెరుగుతుంది.