జిప్‌మర్‌లో ఖాళీలు.. ఇలా సులభంగా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖకు చెందిన పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ZIPMER) ఉద్యోగాలను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ ని విడుదల చేసారు.

we are hiring

ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. దీనిలో మొత్తం 51 ఖాళీలు వున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులుని భర్తీ చేస్తున్నారు. అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఈఎన్‌టీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్స్‌, పీడియాట్రిక్స్‌, సైకియాట్రి, రేడియేషన్‌ అంకాలజీ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.

ఇక వయస్సు విషయానికి వస్తే.. ఏప్రిల్‌ 8, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు. శాలరీ వివరాలని చూస్తే.. నెలకు రూ.90,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. ఆన్‌లైన ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్‌/డీఎన్బీ/బీఎం లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్‌ 8, 2022. జనరల్‌ అభ్యర్ధులకు రూ. 500 ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు రూ. 250 పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. పూర్తి వివరాలను https://jipmer.edu.in/ లో చూడచ్చు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news