కేజిఎఫ్ డైరెక్టర్ తో రెబల్ స్టార్.. ఫ్యాన్స్ హ్యాపీ..!?

బాహుబలి లాంటి వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ హిట్ తర్వాత ప్రభాస్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళి పోయింది అన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ దర్శకులు కాదు ప్రస్తుతం బాలీవుడ్ దర్శకులు కూడా ప్రభాస్ తో సినిమా చేయడానికి క్యూ కడుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఇక ప్రస్తుతం ప్రభాస్ అంటే పాన్ ఇండియా స్టార్ అనే లెవల్లో పెరిగిపోయింది ప్రభాస్ క్రేజ్.

prabhas

ఇకపోతే ఇప్పటికే రెండు పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న ప్రభాస్ కు సంబంధించి ప్రస్తుతం మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి ప్రభాస్ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడని సమాచారం. కేజిఎఫ్ నిర్మాణ సంస్థ అయిన హోమబుల్ ఫిలింస్ సంస్థ డిసెంబర్ 2వ తేదీన బిగ్ అనౌన్స్మెంట్ ఉంది అంటూ ప్రకటించడం మరింత ఆసక్తికరంగా మారిపోయింది ఆ రోజు ప్రభాస్ కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కే సినిమాకు సంబంధించిన ప్రకటన ఉండబోతుంది అని ప్రస్తుతం సోషల్ మీడియా లో టాక్ వినిపిస్తుంది. ఇక ఈ టాక్ తో అభిమానులు అందరూ ఖుషి అవుతున్నారు.