వరంగల్ మేయర్ పీఠంపై కన్నేసిన కొండా దంపతులు

-

వరంగల్ రాజకీయల్లో తమదైన ముద్ర వేసుకున్న కోండా దంపతులు పట్టు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. రాజకీయ నేతలందరు గ్రేటర్ హైదరాబాద్ లో హాడావిడి చేస్తే కోండా దంపతులు మాత్రం వరంగల్ లోనే మకం వేసి గ్రేటర్ వరంగల్ పై ఫోకస్ పెట్టారు. కొండా మురళి వరంగల్ తూర్పు ముఖ్య కార్యకర్తలతో సమావేశం కావడం వరంగల్ మేయర్ పీఠం పై దృష్టిపెట్టడంతో ఎన్నికల సందడి ఓరుగల్లులో అప్పుడే మొదలైంది.


వరంగల్ జిల్లా అధికార పార్టీకి చేందిన ఇద్దరు మంత్రులు .. 10మంది ఎమ్మేల్యేలు,6గురు ఎమ్మేల్సీలు,6గురు కార్పోరేషన్ చైర్మన్లు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నిక ప్రచారంలో బీజీగా ఉన్నారు. ఇక కాంగ్రెస్,బీజేపీకి చెందిన చోటా మోటా నేతలు సైతం గ్రేటర్ ప్రచారానికి తరలి వెళ్ళారు. అయితే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న కోండా దంపతులు మాత్రం హైదరాబాద్ కి వెళ్లకుండా వరంగల్ లోనే మకాం వేసి అనుచరులతో వరుస భేటీలవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజక వర్గం నుండి ఎక్కవ డివిజన్లు గెలిపించుకునేందు కొండా దంపతులు ప్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది.

మారిని రాజకీయ పరినామాలతో వరంగల్ తూర్పు నుంచి 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన కొండా సురేఖ 2018ఎన్నికల్లో టిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. తమ పాత నియోజకవర్గమైన పరకాల నుంచి ఎమ్మెల్యేగా పోటీచేశారు. అనూహ్యంగా ఆ ఎన్నికల్లో కొండా సురేఖ ఓటమి పాలైంది. ఇక వరంగల్ తూర్పు రాజకీయాలకు చాలా కాలం కొండా దంపతులు దూరంగా ఉన్నారు. గత సంవత్సరం జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా డివిజన్ల పెంపుతో పాటు గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ పదవిని కూడా బీసీ జనరల్ గా ప్రకటించారు. దీంతో కొండా దంపతుల అడుగులు పరకాలనుంచి వరంగల్ తూర్పుకు మారాయి.

రానున్న ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి పోటీ చేస్తామనే సంకేతాలు ఇస్తూ కొండా దంపతులు గత ఆరు మాసాలుగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ చైర్మన్ బీసీ జనరల్ కావడంతో కొండా మురళి మేయర్ పీఠం పై కన్నేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన కానీ లేక కూతురు సుష్మితాని కానీ మేయర్ బరిలో నిలిచేలా ప్లాన్ చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ లో టిఆర్ఎస్ పార్టీ కూడా బలంగా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి 58 డివిజనల్లో 50 డివిజనల్లో టిఆర్ఎస్ పార్టీ కార్పో రేటర్లే ఉన్నారు. కేవలం 8డివిజనల్లో మాత్రమే కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం ఇతర స్వతంత్ర అభ్యర్థులు గెలుపొం దారు. వారిలో కూడా నలుగురు గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఎమ్మెల్యే ఎన్నికల అనంతరం జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ, మండల పరిషత్ ఎన్నిలతో పాటు ఆ తర్వాత జరిగిన సర్పంచ్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొండాదంపతులు పెద్దగా ఇంట్రస్టు పెట్టలేదు.. కానీ గత ఆరు మాసాలనుంచి తిరిగి వరంగల్ తూర్పులో రాజకీయ కార్యకలపాలు ముమ్మరం చేశారు. గ్రేటర్ వరంగల్ మెత్తం కాకుండా కేవలం వరంగల్ తూర్పు నియోజక వర్గం పైనే దృష్టి పెట్టి తమ సత్త చాటెందుకు ప్యూహత్మక అడుగులు వేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తవ్వగానే వేంటనే గ్రేటర్ వరంగల్ ఎన్నికల పై ప్రభుత్వం దృష్టి పెడితే అప్పటికప్పుడు కష్టమవుతుందనే భావనలో ఇప్పటి నుంచే ప్లానింగ్ పెట్టి కుతురు రాజకీయ ఆరంగేట్రానికి దారులు వేస్తున్నారు అనే చర్చ ఓరుగల్లులో నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news