ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి మంచి హిట్ అయిన సినిమాల్లో కేజిఎఫ్. ఏ అంచనాలు లేకుండా వచ్చి ఇండియన్ సినిమాలో ఒక సంచలనం సృష్టించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా రెండో భాగం ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్దమవుతుంది. ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది చిత్ర యూనిట్.
త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఈ సినిమాలో విలన్ గా సంజయ్ దత్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. వసూళ్ళ పరంగా కూడా కేజిఎఫ్ మొదటి భాగం బంపర్ హిట్ అయింది. అన్ని భాషల్లో ఈ సినిమా మంచి హిట్ అయింది. ముఖ్యంగా యష్ నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఈ చిత్ర క్లైమాక్స్ సన్నివేశాలు హైదరాబాద్లోనే ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్.
ఆర్ఎఫ్సీలో ప్రత్యేకంగా ఈ చిత్రం కోసమే సెట్ నిర్మిస్తున్నారు. అందులోనే విలన్ సంజయ్ దత్, హీరో యష్ మధ్య యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ లో ఇద్దరూ షర్టు లేకుండా ఉంటారని సమాచారం. నీళ్ళల్లో ఫైట్ ఉంటుందని అంటున్నారు. ఈ సన్నివేశం కోసం దాదాపు 10 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం బాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రఫర్స్ పని చేస్తున్నారు.