రాష్ట్రమంతా ఒక తీర్పు.. ఖమ్మం జిల్లా ఒక తీర్పు

-

తెలంగాణా రాష్ట్రంలో మళ్లీ గులాబి పార్టీ గెలిచింది. డిసెంబర్ 7న జరిగిన పోలింగ్ లో 119 స్థానాల్లో టి.ఆర్.ఎస్ గెలుపు గుర్రాలు నిలబడగా.. ఆ పార్టీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పడి మరి కాంగ్రెస్, టిడిపి, టిజేఎఫ్, సిపిఐ యూనిటీగా తమ అభ్యర్ధులను నిలబెట్టారు. ఇక నిన్న జరిగిన కౌంటింగ్ లో 88 స్థానాల్లో టి.ఆర్.ఎస్ అభ్యర్ధులు గెలిచిన విషయం తెలిసిందే. కొన్ని జిల్లాల్లో టి.ఎస్.ఎస్ కూటమికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితులు ఉన్నాయి.

ఇదిలాఉంటే రాష్ట్రమంతాటా ఒక తీర్పు ఇస్తే కేవలం ఖమ్మం జిల్లాలో మాత్రం పరిస్థితి దీనికి రివర్స్ గా ఉంది. మొత్తం 10 స్థానాల్లో టి.ఆర్.ఎస్ కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అది కూడా ఖమ్మం అసెంబ్లీ స్థానం కావడం విశేషం. 2014 ఎలక్షన్స్ లో కొత్తగుండెం నుండి జలగం వెంకట్రావు టి.ఆర్.ఎస్ అభ్యర్ధిగా నిలబడి గెలిచారు. ఈసారి కూడా అక్కడి నుండి ఆయన నిలబడినా కాంగ్రెస్ అబ్యర్ధి వనమా వెంకటేశ్వర రావు మీద ఓడిపోయారు. మధిర, కొత్తగూడెం, ఇల్లందు, భద్రాచలం, పినపాక, పాలేరు మొత్తం 6 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. పాలేరులో సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు మీద కందాల ఉపేందర్ రెడ్డి గెలవడం జరిగింది. మధిర భట్టి ఓట్ల లెక్కలో ముందు వెనుకంజలో ఉన్నా ఫైనల్ గా తన సత్తా చూపించారు.

ఖమ్మం మహాకూటమి తరపున టిడిపి అభ్యర్ధి నామా నాగేశ్వర రావు పోటీ చేయగా టి.ఆర్.ఎస్ అభ్యర్ధి పువ్వాడ అజయ్ కుమార్ గెలవడం జరిగింది. సత్తుపల్లి సండ్ర వెంకట వీరయ్య టిడిపి నుండి గెలుపొందగా.. అశ్వారావుపేట మచ్చా నాగేశ్వర రావు మహాకూటమి బలపరచిన టిడిపి అభ్యర్దిగా గెలుపొందారు. తెలంగాణా రాష్ట్రం మొత్తం మీద టి.ఆర్.ఎస్ కు షాక్ ఇచ్చిన ఫలితాలు ఏదైనా ఉన్నాయి అంటే అది ఖమ్మం జిల్లా ఫలితాలే అని చెప్పొచ్చు. గులాబి పార్టీకి షాక్ ఇచ్చిన ఖమ్మం జిలా ఫలితాలు ఇక్కడ కె.సి.ఆర్ మరింత దృష్టి పెట్టేలా చేస్తాయో లేక జిల్లాను అశ్రద్ధ చేస్తాయో రానున్న రోజుల్లో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news