Twitter Review : పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న అఖండ

-

నంద‌మూరి హీరో బాలకృష్ణ స్టార్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో వ‌చ్చిన అఖండ సినిమా ఈ రోజు విడుద‌ల అయింది. విడుద‌ల అయిన మొద‌టి రోజు నుంచే హిట్ టాక్ తో అఖండ ప్రేక్ష‌కుల ల్లో కి దూసుకుపోతుంది. ఈ సినిమా కు సంబంధించిన ట్విట్ట‌ర్ రివ్యూ వ‌చ్చేసింది. ఈ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తుంది. ముఖ్యం గా ఈ సినిమా లో అఘోర పాత్ర లో బాల‌య్య అద‌ర‌కొట్టాడ‌ని నందమూరి అభిమానులు అంటున్నారు.

 

అలాగే ఈ సినిమా కు యాక్ష‌న్ తో పాటు థ‌మ‌న్ అందించిన బీజీఎం ప్ల‌స్ గా ఉంటున్నాయ‌ని అంటున్నారు. అంతే కాకుండా అఖండ హై ఓల్టేజ్ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ గా నిలుస్తుంద‌ని నంద‌మూరి అభిమానులు అంటున్నారు. అయితే మాస్ సినిమా ను ఇష్ట ప‌డే వారికి ఈ సినిమా బాగా న‌చ్చుతుంద‌ని అని తెలుస్తుంది. అయితే బాల‌య్య‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబో లో వ‌చ్చిన సినిమా కావ‌డం తో మొద‌టి నుంచే భారీ అంచ‌నాలు ఉన్నాయి. అయితే ఈ అంచ‌నాల‌ను అందుకోవ‌డం లో అఖండ పూర్తి గా విజ‌యవంతం అయిన‌ట్టే అని చెప్పాలి. అలాగే ఈ సినిమా లో ప్ర‌తి నాయ‌కుని పాత్ర లో శ్రీ‌కాంత్ అద్భుతం గా న‌టించాడు.

Read more RELATED
Recommended to you

Latest news