విదేశీయులకు ఇల్లు అద్దెకు ఇస్తే కేసులే.. హైదరాబాద్‌ పోలీసుల వార్నింగ్‌ !

-

విదేశీయులకు ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు వాళ్ల వద్ద నుండి C ఫామ్ తీసుకోవాలని శంషాబాద్ డీసీపీ వార్నింగ్‌ ఇచ్చారు. తీసుకున్న C ఫామ్ ఆన్ లైన్ లో సంబంధిత వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని… అద్దెకు వున్న విదేశీయుల పూర్తి వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని తెలిపారు శంషాబాద్ డీసీపీ.

ఒక వేళ విదేశీయులు చట్ట వ్యతిరేక మైన పనులు చేస్తే వాళ్ల పై ఇళ్లు అద్దెకు ఇచ్చిన యాజమాన్యం పై కూడా కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు 50 మందిని అదుపులోకి తీసుకున్నామని…. అదుపులోకి తీసుకున్న వారిలో నైజీరియా, కాంగో, సోమాలియా, సుడాన్ దేశస్థులుగా గుర్తించామని వెల్లడించారు. విసాలు ముగిసినా అక్రమ ఇండియా లో వుంటున్న వారిని FRRO ముందు ప్రవేశ పెట్టనున్నామని… అక్కడి నుండి వారి దేశాలకు తరలించే ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు.

రాజేంద్రనగర్ ప్రాంతాలలో 200 మంది విదేశీయులు వున్నట్లు గుర్తించాం. వారి వారి విసాలు, పాస్ పోర్టులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని..
ఈ మద్య కాలంలో విదేశీయుల వద్ద డ్రగ్స్, గాంజా పట్టుబడిందని చెప్పారు. ఆ దిశగా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ కొనసాగిందన్నారు. ఆపరేషన్ లో డ్రగ్స్, గంజాయి దొరకలేదని… కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ అన్ని ప్రాంతాలలో కొనసాగిస్తామని పేర్కొన్నారు. మీ మీ ప్రాంతాలలో అనుమానిత వ్యక్తులు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు శంషాబాద్ డీసీపీ.

Read more RELATED
Recommended to you

Latest news