బీజేపీ పార్టీలో చేరనున్న మరో తెలంగాణ ఉద్యమ కారుడు !

-

దుబ్బాక ఎన్నికల్లో బిజెపి పార్టీ విజయం సాధించిన అప్పటినుంచి.. తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీకి ఎదురు లేకుండా పోతుంది. ఈ తరుణంలోనే అధికార టీఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు బీజేపీ కండువా కప్పి ఉంటుంది. ఇలాంటి తరుణంలోనే… ఉద్యమకారుడు అయిన ఈటల రాజేందర్ బిజెపి పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా మరో తెలంగాణ ఉద్యమకారుడు బీజేపీ పార్టీలో చేరనున్నట్లు సమాచారం అందుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో.. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా కొనసాగిన మాజీ టీఎన్జీ వో నేత విఠల్.. తో తెలంగాణ బిజెపి నాయకులు చర్చలు జరుపుతున్నారు. విఠల్ కూడా బిజెపి తీర్థం పుచ్చు కునేందుకు సన్నద్ధం అయినట్టు సమాచారం అందుతోంది. ఈ వారం లో బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో విటల్ బిజెపి లో చేరే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news