Kichcha Sudeep: “కోటికొక్కడు” గా వ‌స్తున్న కిచ్చా సుదీప్.. తెలుగునాట హిట్ కొట్టేనా?

-

Kichcha Sudeep: క‌న్న‌డ‌ స్టార్ కిచ్చా సుదీప్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని పేరు. సుదీప్‌ ‘ఈగ’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ఆ త‌ర్వ‌త బాహుబలి సినిమాలోనూ ఓ చిన్న రోల్ అయినా… తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.సుదీప్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కోటిగొబ్బ-2 ..అటు తమిళంలో, ఇటు కన్నడంలో విడుదలైన మంచి హిట్ సాధించింది.

కన్నడ పరిశ్రమ ట్రేడ్ లెక్కల ప్రకారం రిలీజ్ చేసిన నాలుగు రోజుల్లోనే దాదాపు 40 కోట్లు వసూలు చేసి సుదీప్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో ‘కోటికొక్కడు’ పేరుతో డ‌బ్ చేశారు. శివ కార్తీక్ దర్శకత్వం వ‌హించారు. ఈ సినిమాలో మడోన్నా సెబాస్టియన్, శ్రద్ధాదాస్‌ కథానాయికలుగా నటించారు.

ఈ చిత్రాన్ని నవంబర్ 12న‌ తెలుగులో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ క్రమంలోనే కే3 కోటికొక్కడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో సుధీర్ డ్యూయ‌ల్ రోల్ క‌నిపించ‌నున్నారు. విదేశాల్లో బాంబ్ బ్లాస్ట్ జరగడం, అందులో దాదాపు 40 మంది క్రిమినల్స్ చనిపోవ‌డం. ఇక ఇంటర్ పోల్ అధికారిగా అప్తబ్ శివ్ధసాని క‌నిపించ‌డం చూస్తాం.

ఈ ట్రైల‌ర్లో సుదీప్ ఎంట్రీ.. అదుర్స్.. మడోన్నా సెబాస్టియన్, సుదీప్ జోడిల రొమాన్స్ హిట్ పుట్టిస్తుంది. ఈ ట్రైలర్‌లో శ్రద్దా దాస్, రవి శంకర్, నవాబ్ షా తదితరులు కనిపించారు. మొత్త‌నికి ఈ ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఏ విధంగా ఆక‌ట్టుకుంటుందో వేచి చూడాలి.https://youtu.be/664RwpjGIFc

Read more RELATED
Recommended to you

Latest news