ఏ టీ తో ఎలాంటి లాభాలని పొందచ్చంటే…?

-

చాలా మందికి టీ అంటే ఎంతో ప్రీతి. ప్రతి రోజూ ఒక కప్పు టీ తో రోజుని చాలా మంది మొదలు పెడతారు. నిజంగా ఉదయాన్నే ఒక కప్పు టీ తాగకపోతే రోజంతా కూడా చాలా డల్ గా ఉంటారు. కొంత మంది అయితే టీ లేకపోతే ఉండలేరు. అయితే ఈ రోజు నిజంగా టీ తాగడం వల్ల మంచిదేనా..?, తాగితే ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అనేది చూద్దాం.

 

ఆరోగ్యం బాగుండాలంటే ఎప్పుడూ మనం తీసుకునే ఆహార పదార్థాలు బాగా ఉండాలి. అదే విధంగా మంచి జీవన విధానాన్ని పాటించాలి. అయితే టీ తాగడం వల్ల కడుపు నొప్పి మొదలైన సమస్యలు కూడా వస్తాయి. కానీ అన్ని టీ లు ఒకేలా ఉండవు. టీ లో రకాలు ఉన్నాయి మరియు వాటి వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి వాటి కోసం ఒక లుక్ వేసేయండి.

టీ లో రకాలు మరియు వాటి వల్ల కలిగే ప్రయోజనాలు:

ఆరోగ్య ప్రయోజనాలను మీరు దృష్టిలో పెట్టుకుని టీ ని తీసుకుంటే మంచిది. ఎందుకంటే కొన్ని రకాల టీ ల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

గ్రీన్ టీ:

చాలా మంది ఫిట్నెస్ ఫ్రీకర్స్ ఎక్కువ గ్రీన్ టీ తాగుతూ ఉంటారు. అయితే గ్రీన్ టీ తాగడం వల్ల గుండెకి మంచిది. ఊబకాయాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. అదే విధంగా హార్ట్ ఎటాక్ సమస్య రాకుండా చూసుకుంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కూడా తగ్గిస్తుంది. కాబట్టి గ్రీన్ టీ తీసుకుంటే ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

బ్లాక్ టీ:

బ్లాక్ టీ తీసుకోవడం వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనం ఉంది. సాధారణంగా చాలా మంది స్మోకింగ్ చేస్తూ ఉంటారు. స్మోకింగ్ వల్ల సమస్యలు తగ్గించాలంటే బ్లాక్ టీ తీసుకుంటే మంచిది. అదేవిధంగా హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

వైట్ టీ:

ఇక వైట్ టీ గురించి చూస్తే ఇది హృదయ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది. క్యాన్సర్ మరియు బాక్టీరియా నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. చర్మంపై ముడతలు త్వరగా రాకుండా ఇది చూసుకుంటుంది. చూసారా ఈ టీ ల వల్ల ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చో. మరి మీ ఆరోగ్యానికి ఏది మంచిదో చూసుకుని దానిని మీరు తీసుకోండి. అలా చేస్తే మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు. సమస్యల నుండి దూరంగా ఉండచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news