ఈ మధ్య కాలం లో చాలా మంది ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో కిడ్ని సమస్యలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. కిడ్నీలు రక్తాన్ని ప్యూర్ గా ఉంచుతాయి. యూరినరీ ఫంక్షన్ పై ప్రధాన పాత్ర పోషిస్తాయి కిడ్నీలు. అయితే కిడ్నీలు ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలి. సమస్యలు ఏమైనా వచ్చినట్లయితే గుర్తించి వైద్యం తీసుకోవాలి.
కిడ్నీ సమస్యలు ఉంటే కలిగే లక్షణాలు:
ఒక్కొక్క సారి ఎటువంటి లక్షణాలు కూడా లేకుండా కిడ్నీ సమస్యలు వస్తూ ఉంటాయి. ఆరోగ్యకరమైన కిడ్నీలు నిమిషానికి 120 మిల్లీ లీటర్లను ఫిల్టర్ చేస్తాయి ఒకవేళ కనుక కిడ్నీ సమస్యలు వచ్చాయి అంటే ఆ ఫిల్టరేషన్ పవర్ తగ్గుతుంది.
కిడ్నీ సమస్యలు లక్షణాలు:
నీరసం ఉండడం
హెమోగ్లోబిన్ తక్కువగా ఉండటం
హైబీపీ
కిడ్నీ సమస్యలు తీవ్రంగా ఉంటే ఈ లక్షణాలు ఉంటాయి:
వికారం
వాంతులు
ఆకలి లేక పోవడం
నీరసం ఎక్కువ ఉండడం
డయాబెటిస్
హై బీపీ
అలానే కిడ్నీ సమస్యలు ఉంటే తరచూ జ్వరం రావడం, యూరిన్ వెళ్లేటప్పుడు నొప్పి కలగడం, జ్వరం వంటి లక్షణాలు కూడా ఉంటాయి.
కిడ్నీ సమస్యల రిస్క్:
కిడ్నీ సమస్యలు ఉండి డయాబెటిస్ మరియు హైబీపీ ఉంటే ఎక్కువ ప్రమాదం వుంటుంది. ఎడారి ప్రాంతంలో ఉండే వారు తక్కువ నీళ్లు తాగుతూ వుంటారు. దీనితో వారిలో కిడ్నీ స్టోన్స్ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. 45 శాతం కిడ్నీ సమస్యలు డయాబెటిస్ వల్ల వస్తాయి. 27 శాతం కిడ్నీ సమస్యలు బీపీ పెరిగిపోవడం వల్ల వస్తాయి.
కిడ్నీల ఆరోగ్యం బాగుండాలంటే తీసుకోవాల్సిన డైట్:
అయితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రత్యేకమైన ఫుడ్ అంటూ ఏమీ లేదు. అయితే వీటిని డైట్ లో బాగా తీసుకోవడం మంచిది.అలానే సరిపడా నీళ్లు తాగడం కూడా చాలా ముఖ్యం.
ఆకుకూరలు
కాయగూరలు
పండ్లు