నీలం మధు రాజీనామాతో బీఆర్ఎస్ కు భారీ నష్టం.. మంచి నేతలు దూరమవుతున్నారుగా!

-

తెలంగాణలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే పలువురు నేతలు షాకివ్వగా ఆ జాబితాలో నీలం మధు కూడా చేరారు. పటాన్ చెరు బీఆర్ఎస్ నేత, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నేత నీలం మధు ముదిరాజ్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. అహంకారం కావాలో ఆత్మగౌరవం కావాలో తేల్చుకోవాలంటూ నీలం మధు కామెంట్లు చేశారు. అయితే నీలం మధు రాజీనామాతో పార్టీ తీవ్ర స్థాయిలో నష్టపోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బీఆర్ఎస్ పార్టీకి మంచి నేతలు దూరమవుతున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ ముదిరాజ్ లకు మేలు చేసేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో నీలం మధు తీవ్రస్థాయిలో ఆవేదన చెందారని తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేయడానికి నీలం మధు ఎంతో కృషి చేసినా పార్టీ ముదిరాజ్ లకు పార్టీ తీవ్రస్థాయిలో అన్యాయం చేయడంతో ఆయన మనస్సు కలత చెందిందని సమాచారం.

ప్రజల మనిషిగా పోటీ చేస్తున్న నీలం మధు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసినా, ఏదైనా పార్టీ నుంచి పోటీ చేసినా ఎమ్మెల్యేగా పోటీ చేసినా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా రాజకీయ పార్టీ నుంచి పిలుపు వస్తే ఆ పార్టీ నుంచి పోటీ చేయాలని అలా జరగని పక్షంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ప్రజల మద్దతుతో గెలవాలని నీలం మధు భావిస్తున్నారు.

ప్రస్తుతం చిట్కుల్ సర్పంచ్ గా ఉన్న నీలం మధు ఎమ్మెల్యే అయితే ముదిరాజ్ ల సమస్యలను పరిష్కరించడంతో పాటు పటాన్ చెరు ప్రజలకు మేలు జరిగేలా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం అందుతోంది. పార్టీ కోసం కష్టపడుతున్న మంచి నేతలకు కేసీఆర్ సర్కార్ తగిన ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని చెప్పవచ్చు. ప్రజల సపోర్ట్ ఉన్న నీలం మధు ఎన్నికల్లో ఊహించని స్థాయిలో మెజారిటీ సాధించి ఎమ్మెల్యే కావడం ఖాయమని స్థానికులు చెబుతున్నారు. నీలం మధును తమ పార్టీలోకి ఆహ్వానించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version