కిరణ్ అబ్బవరం “మీటర్” మూవీ టీజర్ రిలీజ్

-

వైవిద్యమైన కథలు, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటున్న యంగ్ టాలెంటెడ్ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. ఈ యంగ్ హీరో లేటెస్ట్ గా “వినరో భాగ్యము విష్ణు కథ” అనే సినిమా చేసి మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ సినిమా వచ్చిన మరో నెల రోజులలోనే ఇంకో సినిమా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాడు.

ఈ యంగ్ హీరో తాజాగా నటించిన పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రం “మీటర్”. రమేష్ కాడూరి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ మరియు క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న మీటర్ సినిమాలో కిరణ్ అబ్బవరం మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో అతుల్య హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం ఓ పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ లో ఓ పోలీస్ ఆఫీసర్ కి, ఓ పొలిటీషియన్ కి మధ్య యుద్ధం మొదలైతే ఎలా ఉంటుంది అనేది మెయిన్ పాయింట్ లా కనిపిస్తుంది. ఈ చిత్రం ఏప్రిల్ 7వ తేదీన వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news