రైతులకి గుడ్ న్యూస్.. 7 శాతం వడ్డీ నుండే లోన్..!

-

అన్నదాతల కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని బెనిఫిట్స్ ని ఇస్తోంది ప్రభుత్వం. వీటి వలన ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది రైతులకి. అయితే ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ ని కూడా రైతుల కోసం ఇస్తోంది.

farmers

దీని వలన కూడా రైతులకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కార్డు ద్వారా రైతులు వ్యవసాయ రుణాలు తీసుకోవచ్చు. అయితే మరి ఎవరెవరు తీసుకోవచ్చు మొదలు అన్ని వివరాలను చూసేద్దాం. ఈ లోన్ ని సింగల్ గా లేదా కలిసి తీసుకోవచ్చు.

ఎవరు అర్హులు?

ఈ లోన్ ని పొందాలంటే కనీస వయస్సు 18 ఏళ్లు ఉండాలి. మాక్సిమం అయితే 75 ఏళ్లు ఉండాలి.

కిసాన్ క్రెడిట్ కార్డుని ఎలా పొందాలి..?

కిసాన్ క్రెడిట్ కార్డులుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి బ్యాంకులన్నీ ఇస్తాయి.

కిసాన్ క్రెడిట్ కార్డ్ వివరాలు:

రైతులు కనుక ఎస్‌బీఐ కిసాన్ క్రెడిట్ కార్డ్ ని తీసుకుంటే వార్షిక వడ్డీ 7 శాతం నుంచి మొదలు అవుతుంది.
పీఎన్‌బీ కిసాన్ క్రెడిట్ కార్డ్ వార్షిక వడ్డీ కూడా 7 శాతం నుండి మొదలు అవుతుంది.
అదే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అయితే 9 శాతం నుంచి, యాక్సిస్ బ్యాంక్ అయితే 8.85 శాతం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అయితే 7 శాతం నుంచి ప్రారంభం అవుతాయి.

కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం కావాల్సిన పత్రాలు:

ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడెంటిటీ కార్డ్ అవసరం అవుతాయి.
ఇలాంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా కార్డుని పొందాలంటే కావాలి.
అలానే పొలానికి సంబంధించి రెవెన్యూ అధికారులు ధృవీకరించిన డాక్యుమెంట్స్ తో పాటు ఇతర సెక్యూరిటీ డాక్యుమెంట్స్ కావాలి.
ఆన్ లైన్ లో కూడా కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news