నేను నాగలి కడతా.. నువు కడతవా : కేసిఆర్ కు కిషన్ రెడ్డి సవాల్

-

తాను నాగలి కడుతా… తనతో నాగలి కట్టేందుకు కేసీఆర్ సిద్ధమా ? అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. వచ్చే రబీ గురించి దేశంలో ఏ రాష్ట్రానికి టార్గెట్ ఇవ్వలేదు. అన్ని రాష్ట్రాలతోనే తెలంగాణకు టార్గెట్ ఇస్తామన్నారు. సమస్య అంతా బాయిల్డ్ రైస్ తో వచ్చింది. తెలంగాణలో ఒక్క కుటుంబం కూడా బాయిల్డ్ రైస్ తినదన్నారు. అనవసరంగా రైతులను బయపెట్టకండి… పంటమార్పడి కి బీజేపీ.. రాష్ట్ర ప్రభుత్వంకు సహకరిస్తుందని పేర్కొన్నారు.


గడిచిన ఏడేళ్లుగా కేసీఆర్ ధాన్యం కొంటున్నా అని చెప్పి- ఇవ్వాళ మాత్రం కేంద్రమే కొంటుందని ధర్నా చేశారని మండిపడ్డారు. పంటను కొనే భాద్యత కేంద్రం భాద్యత మాత్రమే కాదు- రాష్ట్ర ప్రభుత్వం కూడా భాద్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా పంటను ఎందుకు కొనడం లేదు? అన్నారు.

రా రైస్ తయారు చేస్తే దానికి సంబంధించిన టెక్నీకల్ వ్యవస్థ గోదాముల ఉన్నాయా? ఇప్పుడు కేంద్రం బాయిల్డ్ రైస్ కొంటుందని.. చెప్పారు. తెలంగాణ ఏర్పడిన రోజు ghmcలో మిగులు బడ్జెట్ ఉండేనని.. ఇప్పుడు అధికారులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు. కార్పొరేషన్ పేరుతో అప్పులు తెచ్చారని.. ఉన్న వాటిని అభివృద్ధి చేయకుండా కంటోన్మెంట్ కావాలని అడుగుతున్నారని అగ్రహిం చారు. హైదరాబాద్ నగరం రోడ్లు అద్వనంగా తయారు అయ్యాయని.. 21 రోడ్లు ఎక్కడ బ్లాక్ చేశారో కేటీఆర్ చెప్పాలని సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news