చింతల్ బస్తీలో పీఎం స్వనిది కింద స్ట్రీట్ వెనడర్స్ కు గుర్తింపు కార్డులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందించారు. ఈ కార్యక్రమానికి చింతల రామ చంద్రారెడ్డి, రాములు, కరుణాకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… కరోన వల్ల చిన్నవ్యాపారస్తులు చితికిపోయారు అని ఆయన పేర్కొన్నారు. చిన్న వ్యాపారస్తుల కష్టాలు తీర్చటానికే స్ట్రీట్ వెండర్స్ స్వనిధి పథకం అని వివరించారు.
గుర్తింపు కార్డులు పొందిన ప్రతి ఒక్కరికి 10వేల ఆర్థిక రుణసాయం అందుతుంది అని ఆయన పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకూ మాస్కులు శానిటైజర్ తప్పనిసరిగా వాడాలి అని ఆయన సూచించారు. చిన్నపిల్లలను, వృద్ధులను కరోనా నుంచి కాపాడుకునే బాధ్యత మనందరిపైనా ఉంది అని ఆయన అన్నారు. స్వనిది కింద 10వేలు రుణసాయాన్ని పొంది, తిరిగి కట్టిన వాళ్లకు 30 వేల వరకు ఆర్థిక సాయం అందుతుంది అని ఆయన స్పష్టం చేసారు.