వ్యవసాయ బిల్లుతో రైతులకు సదవకాశం : కిషన్ రెడ్డి

-

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లును తీసుకువచ్చి సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. పక్షాలు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ వ్యవసాయ బిల్లులకు ఉభయసభల్లో ఆమోదం ముద్ర వేయించిన కేంద్ర ప్రభుత్వం వీటిని చట్టాలుగా మార్చింది . తాజాగా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై మీడియాతో మాట్లాడిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి… వ్యవసాయ బిల్లు ద్వారా జరిగే మేలు గురించి చెప్పుకొచ్చారు. కేవలం రైతుల అభ్యున్నతి కోసమే కేంద్రం వ్యవసాయ బిల్లును తీసుకు వచ్చింది అంటూ కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

రైతులకు ప్రభుత్వం నుంచి స్వేచ్ఛ లభించడం విపక్షాలకు నచ్చడం లేదని అందుకే వ్యవసాయ బిల్లు పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము పండించిన పంటను తమకు గిట్టుబాటు ధర దొరికిన చోట ఎక్కడైనా అమ్ముకునే వీలు ఉండేలా వ్యవసాయ బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయి అంటూ తెలిపారు. ఈ బిల్లు ద్వారా రైతులు ఎక్కడైనా సురక్షితమైన వ్యాపారాలు చేసుకునేందుకు వీలు ఉంటుంది అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశాన్ని ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకు వెళ్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news