కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. రాములు నాయక్, భూపతి రెడ్డి పై అనర్హత వేటు వేసినప్పుడు కేసీఆర్ ఎన్నో నీతులు చెప్పిండని అన్నారు. కేసీఆర్ తాను చెప్పిన నీతులకు కూడా కట్టుబడి లేరు అని ఆయన ఆరోపించారు. పార్టీ మారిన నాయకుల పై అనర్హత వేటు వేయాలని మేము కోరినా ఎన్నికల సంఘం అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు.
ఇప్పుడు క్యాంపులు పెట్టడమే నేరమే అని ఆయన పేర్కొన్నారు. వాటి పై ఎన్నికల కమిషన్ ఎందుకు నిఘా పెట్టడం లేదు అని విమర్శించారు. కేసీఆర్ నీతులు చెప్పడం కాదు ఆచరించండని విమర్శలు చేసారు. పార్టీ ఫిరాయింపుల పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం అని అన్నారు. న్యాయ స్థానాల్లో కూడా పోరాడుతాం అని ఆయన పేర్కొన్నారు.