తెలంగాణలోని ట్రైబల్ మ్యూజియానికి రూ.15 కోట్ల నిధులు : కిషన్ రెడ్డి

-

జాతీయ గిరిజన గౌరవ దినోత్సవం గా నవంబర్ 15 బిర్సా ముండా జయంతి నిర్వహించాలని.. తెలంగాణలోని ట్రైబల్ మ్యూజియం రూ. 15 కోట్ల నిధులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. కోటి రూపాయలు ఇప్పటికే విడుదల చేశామని.. మ్యూజియం పనులు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాలని దేమం చేశారు.

సమ్మక్క సారలమ్మ జాతరకు 2 కోట్లు గతంలో ఇచ్చిందని.. జరగబోయే జాతర కు కూడా కేంద్రం నిధులు ఇస్తుందన్నారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం హరిత భవన్ ని నిర్మించిందని.. అక్టోబర్ 9 న కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.. ఎయిమ్స్ కి బిల్డింగ్ ని ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అప్పగించలేదని అందులో పేర్కొన్నారని గుర్తు చేశారు.

నేను కూడా రాష్ట్ర ప్రభుత్వం కి లేఖ రాశాను ఇప్పటికి సమాధానం లేదని.. ఆ భవనం నిర్మాణం రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టింపులకు పోకుండా , రాద్ధాంతాలు చేయకుండా బిల్డింగ్ ను అప్పగించండి అని పేర్కొన్నారు. నేను ఛాలెంజ్ చేయదం లేదు… మీ ఛాలెంజ్ లు ఎందుకో తెలంగాణ ప్రజలకు ఇప్పుడు అర్గం అవుతోందని తెలిపారు. నేను అబద్దాలు చెబుతున్నానని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఒక్క కాలేజి కూడా ఇవ్వలేదని అంటున్నారు… ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ తెలంగాణ కు వచ్చిందని కౌంటర్ ఇచ్చారు..

Read more RELATED
Recommended to you

Latest news