సిరిసిల్లలో దారుణం.. మహిళా ఎస్సై పై టిఆర్ఎస్ నాయకుల దాడి !

-

అధికార టీఆర్ఎస్ పార్టీ.. ధాన్యం కొనుగోలు అంశంపై నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహించింది. అయితే ఈ ధర్నాలు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గోధుమలు తినేవాడికి.. వ్యవసాయం గురించి ఏం తెలుసు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే రసమయి బాలకిషన్ చేసిన ఆ వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది.

అంతే కాదు పలుచోట్ల రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇందులో భాగంగానే కేటీఆర్ ఇలాక అయిన సిరిసిల్ల లో బిజెపి దళిత మోర్చా… రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకులతో గొడవకు దిగారు టిఆర్ఎస్ నాయకులు. గొడవ పెద్దది కావడంతో.. స్థానిక మహిళా ఎస్సై సంధ్య అక్కడ పరిస్థితి ని సద్దుమణిగే ప్రయత్నం చేశారు. అయితే అక్కడితో ఆగకుండా… టిఆర్ఎస్ నాయకులు ఆ మహిళ ఎస్సై సంధ్య పై దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసిన సిరిసిల్ల టౌన్ సిఐ అనిల్ కుమార్… ఘటనా స్థలానికి చేరుకొని… టిఆర్ఎస్ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం టీఆర్ఎస్ నాయకులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news