నవంబర్ 1 తర్వాత తదుపరి జాబితా : కిషన్ రెడ్డి

-

కేంద్రమంత్రి అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘జనసేన.. ఎన్డీయే భాగస్వామి. నవంబర్ 1న బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత బీజేపీ తదుపరి జాబితా విడుదల చేస్తాం’ అని తెలిపారు. కాగా ఈనెల 22న రాష్ట్రంలో బీజేపీ 52 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా తదుపరి సీట్లలో కొన్నింటిని జనసేనకు ఇచ్చే ఛాన్స్ ఉంది. అంతే కాదు, “అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్ట్ భద్రత.. మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ నాణ్యతపై అనుమానం బయటపడుతోంది. కేసీఆర్ ఒక సూపర్ ఇంజినీర్‌గా అవతారం ఎత్తి డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ నిర్మించిన ఈ ప్రాజెక్ట్ గుదిబండగా మారింది.

దిల్లీలో తెలంగాణ బీజేపీ పెద్దల కీలక మంతనాలు.. ఇవాళ ఫస్ట్ లిస్ట్ ప్రకటించే  అవకాశం

లక్ష్మి బ్యారేజ్ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ కు లైఫ్ లైన్. ఇది దెబ్బతింటే మొత్తం వ్యవస్థపై దాని ప్రభావం ఉంటుంది. తెలంగాణ ప్రజల సంపద దోచుకోవడం కోసం కట్టిన ప్రాజెక్ట్. ఇది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎమ్ లా మారింది తప్ప, ‘ఎనీ టైం వాటర్’ గా మాత్రం మారలేదు. వేల కోట్ల రూపాయల మేర అప్పు చేసి నిర్మించడమే ఒక దుర్మార్గం. పిల్లర్లు కుంగిపోవడం చాలా పెద్ద సమస్య. కుంగిపోయిన తర్వాత 85 గేట్స్ ఎత్తి 10 టీఎంసీల నీటిని కిందకు వదిలేయాల్సి వచ్చింది. గత ఐదేళ్లలో ఈ ప్రాజెక్ట్ అనుకున్న లక్ష్యాలు చేరుకోలేకపోయింది. ఏడాదికి 400 టీఎంసీల నీటిని ఎత్తి పోస్తాం అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news