కేంద్ర కేబినేట్‌ విస్తరణ.. కిషన్‌రెడ్డికి ప్రమోషన్‌

-

కేంద్ర కేబినేట్‌ విస్తరణపై కసరత్తు పూర్తి అయింది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్‌ విస్తరణ జరుగనుంది. ఈ కేబినెట్‌ విస్తరణలో కొత్తగా 24 మందికి అవకాశం కల్పించే ఛాన్స్‌ ఉంది. అయితే.. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి కిషన్‌ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఈ సారి కేబినేట్‌ విస్తరణలో సికింద్రాబాద్‌ ఎంపీ కిషన్‌రెడ్డికి ప్రమోషన్‌ ఇచ్చే అవకాశాలున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.

kishan-reddy

ప్రస్తుతం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డికి.. కేబినేట్‌ హోదా ఇస్తారని ఢిల్లీలో ప్రచారం సాగుతోంది. కిషన్‌ రెడ్డికి కేబినేట్‌ హోదా ఇస్తే శాఖ మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే అనురాగ్‌ ఠాగూర్‌కు స్వతంత్ర హోదాతో మంత్రి పదవి దక్కే ఛాన్స్‌ ఉంది.

ఇక ఆశావహులంతా అందుబాటు లో ఉన్నారు. ఒక్కొక్కరుగా ప్రధాని నివాసానికి కొంతమంది మంత్రులు, ఆశావహులు చేరుకుంటున్నారు. అటు భూపేందర్ యాదవ్, మీనాక్షి లేఖి, నారాయణ రాణే, ప్రీతమ్ ముండే, అనుప్రియా పటేల్, అనురాగ్ ఠాగూర్, శంతన్ ఠాగూర్, సునీత దుగ్గల్, శోభ కరందలాజే, అజయ్ భట్, జ్యోతిరాదిత్య సింఘియా, సర్బానంద సోనోవాల్, కపిల్ పాటిల్ ప్రధానిని కలిశారు.

Read more RELATED
Recommended to you

Latest news