మందుబాబులకు మరో గుడ్‌ న్యూస్‌.. తెలంగాణలో ఇక లిక్కర్‌ ఫ్రీ..!

-

కరోనా మహమ్మారి కారణంగా ప్రజల ఉపాధినే కాకుండా అన్ని ప్రభుత్వాల ఖజానాకు గండిపడింది. దీంతో పెట్రోల్‌, లిక్కర్లపై ధరలను పెంచేశాయి చాలా ప్రభుత్వాలు. ఆ లిస్టు తెలంగాణ మొదటి స్థానంలో ఉందనే చెప్పాలి. లిక్కర్‌ ధరలు పెరగడంతో మొదట్లో లాభాలు వచ్చినప్పటికీ… ఆ తర్వాత సెల్స్‌ తగ్గాయి. దీంతో దిగివచ్చిన తెలంగాణ సర్కార్‌.. ఇటీవలే బీర్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బీరు సీసాపై రూ. 10 తగ్గిస్తూ.. కేసీఆర్‌ సర్కార్‌ మొన్న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెలంగాణ లోని మందుబాబులకు చాలా ఊరట లభించింది.

అయితే.. ఈ శుభవార్త నుంచి మందుబాబులు తేరుకోకముందే.. మరో శుభవార్త చెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోందట. వారానికి ఒక రోజు లిక్కర్‌ ఫ్రీ ఆఫర్‌ను ప్రకటంచాలని చూస్తోందట.

కొన్ని వారాల పాటు దీన్ని అమలు చేసిన తర్వాత ఒకటి కొంటే మరొకటి ఉచితం లాంటి ఆఫర్‌ ను కూడా ప్రకటించాలని అనుకుంటోందట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెకండ్‌ క్వార్టర్‌కు అడ్వాన్స్‌ టాక్స్‌ చెల్లించలేమని.. దీన్ని మాపీ చేయాలని కొన్ని బార్ల యజమానులు ఎక్సైజ్‌ శాఖను కోరారట. ఈ నేపథ్యంలో లిక్కర్‌ ఫ్రీ ప్రతిపాదన తెరపైకి వచ్చిందని సమాచారం. అయితే… దీనిపై తెలంగాణ సర్కార్‌ త్వరలోనే నిర్ణయం తీసుకోనుందట.

Read more RELATED
Recommended to you

Latest news