జర్మనీలో కేఎల్ రాహుల్ కు సర్జరీ పూర్తి.. త్వరలో కలుద్దాం అంటూ ట్వీట్

-

టీమిండియా క్రికెటర్, లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ కు జర్మనీ వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేశారు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అతడికి గజ్జ భాగంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. దక్షిణాఫ్రికాతో 5 టి-20 ల సిరీస్ కు కెప్టెన్ గా వ్యవహరించాల్సిన కేఎల్ రాహుల్ ఉన్నట్టుండి గాయంతో తప్పుకున్న విషయం తెలిసిందే. కాగా శస్త్ర చికిత్స పూర్తయినట్లు ట్వీట్ చేశారు.

” అందరికీ హలో.. కొన్ని వారాల నుంచి కష్టంగా ఉంది. కానీ సర్జరీ విజయవంతమైంది. నా గాయం మానుతుంది. చక్కగా కోలుకుంటున్నాను. కోలుకునే క్రమం మొదలైంది. నీ సందేశాలకు, ప్రార్థనలకు ధన్యవాదాలు. త్వరలో కలుద్దాం”. అంటూ కె.ఎల్.రాహుల్ పోస్ట్ పెడుతూ తాను ఆసుపత్రి బెడ్ పై నవ్వుతూ ఉన్న ఫోటోను షేర్ చేశాడు. అయితే రోహిత్ శర్మ కూడా గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో జూలై 1 నుంచి మొదలయ్యే టెస్ట్ మ్యాచ్లో శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. రోహిత్, రాహుల్ తిరిగి అందుబాటులోకి వస్తే టీమిండియా అన్ని ఫార్మాట్లలో గాడిలో పడే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news