ఆయోధ్యలో 500 ఏండ్ల కల సాకారం అయ్యింది. రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ దేవాలయం చుట్టూ 27 నక్షత్రాలకు ప్రతీకగా ఆయా నక్షత్ర సంబంధ వృక్షాలను నాటుతున్నారు. అయితే ప్రధాని నరేంద్రమోదీ నాటిని మొక్క విశేషాలు తెలుసుకుందాం….
ఇక్కడ భూమి పూజలో పాల్గొనే ముందు..వివిధ ఆలయాలను ప్రధాని మోడీ సందర్శించారు. పూజ కార్యక్రమం జరిగే ప్రాంతంలో మోడీ..‘పారిజాత’ను మొక్కను నాటారు. కానీ..ఈ మొక్కనే ఎందుకు నాటారు ? అనే దానిపై ఆసక్తి కనబరిచారు. పారిజాతం మొక్క ఏంటీదీ ? దీనివల్ల ఉపయోగాలు ఏంటీ ? అనే దానిపై సెర్చ్ చేశారు. ఈ చెట్టు 10 నుంచి 15 అడుగుల వరకు పెరుగుతుంది. చెట్టుకు పూలు ఎక్కువగా పూస్తుంటాయి. ఇందులో ఔషధగుణాలు ఉన్నాయని అంటారు. కాళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులు, పైల్స్, గుండె సంబంధిత వ్యాధులు, ఇతరత్రా అనారోగ్య సమస్యలు తీరుతాయని వెల్లడిస్తున్నారు. పూలను గ్రైండ్ చేసి గుజ్జులో తేనే కలిపి తాగితే..పొడ దగ్గు తగ్గడం, చర్మ రోగాలు నయం అవుతాయని చెబుతున్నారు. ఈ రసం తాగితే జ్వరం తగ్గుతుందంటున్నారు. దేవతలకు పారిజాత పుష్పాలు అత్యంత ప్రీతిపాత్రమైనదిగా చెబుతారు. ఈ పూల నుంచి సుగంధ తైలాన్ని తయారు చేస్తారు.
పారిజాత పుష్పాన్ని శ్రీ కృష్ణుడు స్వర్గం నుండి తీసుకరావడానికి ప్రయత్నించి కష్టాలో పడుతాడని పురాణాలు చెబుతున్నాయి. సత్యభామకి బహుకరించిన ఈ చెట్టు..ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారాబంకి జిల్లాలో కింటూర్ గ్రామంలో ఉందని ఇక్కడ స్థానికులు చెప్తుంటారు. పుష్పాలు అందంగా బంగారు రంగు, తెలుపు రంగులో ఉంటాయి. ఐదు రేకులు కలిగి ఉంటాయి. పుష్పాల సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. విష్ణు ఆరాధనలో ఎక్కువగా పారిజాత పుష్పాలను ఉపయోగిస్తుంటారు. తెలుగులో పారిజాత పుష్పం పై అనేక పాటలు కూడా వచ్చాయి. సుకుమార్యానికి పారిజాతం పుష్పాన్ని ఉదహరిస్తుంటారు.
– శ్రీ