టిడిపి అధినేత చంద్రబాబు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రెవేటికరణ చేయొద్దని పవన్ మోడీని అడగాలని అన్నారు. పవన్ ఇస్తున్న వార్నింగ్ లు మోడీకి ఇవ్వాలి.. జగన్ కి కాదు..అంటూ కొడాలి నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, పవన్ లకు మోడీ.. అమిత్ షా అపాయింట్మెంట్ దొరకడం లేదు అంటూ కొడాలి చెప్పారు. చివరికి మోడీ అమిత్ షా అపాయింట్మెంట్ కావాలన్నా సీఎం జగన్ కావాల్సి వచ్చారు అంటూ కొడాలి వ్యంగ్యాస్త్రాలు కురిపించారు.
అఖిల పక్షం ద్వారా అయినా వాళ్ళని కలవాలని ఇద్దరూ చూస్తున్నారు అంటూ కొడాలి వ్యాఖ్యానించారు. రాజకీయ అవసరాల కోసం ఉన్న చంద్రబాబు, పవన్ లను కేంద్రం వద్దకి తీసుకువెళ్లే ప్రసక్తి లేదు అంటూ కొడాలి ఫైర్ అయ్యారు. వారం కాదు.. ఏడేళ్లు డెడ్ లైన్ పెట్టుకున్నా పర్లేదు.. ఏమి చేసుకుంటావో చేసుకో..అంటూ పవన్ కు కొడాలి సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏనాడైనా పక్క రాష్ట్రం సీఎంలను కలిసారా అంటూ కొడాలి ప్రశ్నించారు. సీఎం జగన్ మారుమూలన ఉన్న 21 గ్రామాల కోసం ఒరిస్సా సీఎం కలిసేందుకు వెళ్లారని చెప్పారు.