ఏపీ మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది రోజులుగా చంద్రబాబుని, ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను అనేక రకాలుగా కాఎమ్త్స్ చేస్తూ వస్తోన్న ఆయన తాజాగా హద్దు మీరి వ్యాఖ్యానించారు అనే చెప్పాలి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నారో.. లేక చంద్రబాబు చేతిలో ఉన్నారో అందరికీ తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగ వ్యవస్థలపై మాకు గౌరవం ఉంది కానీ దొంగలను తీసుకు వచ్చి చంద్రబాబు రాజ్యాంగ బద్ద పదవిలో కూర్చోబెట్టారని అన్నారు. అలాగే ఎవరిని అడిగి నిమ్మగడ్డ రమేష్ గతంలో స్థానిక ఎన్నికలను ఆపారు ? అని ప్రశ్నించిన ఆయన ప్రతిపక్ష నేేతలతో మాట్లాడి ఇప్పుడు ఎన్నికలను జరుపుతారా ? అని ప్రశ్నించారు.
కుక్కను తీసుకొచ్చి సింహాసనం కూర్చోబెట్టారన్న ఆయన నిమ్మగడ్డ రమేష్ ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నిమ్మగడ్డ రమేష్ ను తొలగిస్తే రాజ్యాంగ పదవుల మీద గౌరవం పెరుగుతుందని అన్నారు. ఇక రాష్ట్రంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని చంద్రబాబు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానన్న ఆయన ప్రభుత్వానికి ఆదాయం పోవడానికి వీలు లేదనే ఉచిత ఇసుక అమలు చేయలేదని అన్నారు. ఇసుక అందరికీ అందించేందుకే తక్కువ ధరకే ఇసుకను సీఎం అందిస్తున్నారని చంద్రబాబు చెప్పినట్లు రీచ్ పక్కన 8వేల ఇసుక ఎక్కడా లేదని అన్నారు. శేఖర్ రెడ్డి కి ఇసుక కట్టబెట్టాల్సిన అవసరం మాకు లేదన్న ఆయన పేదల కోసం సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.