ప్రైవేట్ ఆస్పత్రులపై మంత్రి కొడాలి నానీ సంచలన వ్యాఖ్యలు…!

గుడివాడ మిస్టర్ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి కొడాలి నాని… కార్పోరేట్ ఆస్పత్రుల వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో కార్పొరేట్ హాస్పటళ్ల పై తీవ్రంగా స్పందించారు ఆయన. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఉచ్చం నీచం మరిచి, కొందరు చీడపురుగుల్లా మారి దోచుకోవడం దారుణం అని మండిపడ్డారు. శవాల మీద డబ్బులు ఏరుకొనే సంస్కారహీనులను అధికారులు గుర్తు పెట్టుకోవాలి అని ఆయన సూచించారు.

kodali nani

పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత కుక్క కాటుకు చెప్పు దెబ్బలా దోచుకు తినే హాస్పిటల్స్ ను అధికారులు ఫినిష్ చేయాలి అని సూచించారు. ఆసుపత్రులను క్షమిస్తే, భవిష్యత్తు తరాలకు ద్రోహం చేసినట్లవుతుందని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు మానవతా దృక్పథంతో ఆలోచించాలి అని ఆయన ఈ సందర్భంగా సూచించారు.