కోహినూర్‌ వజ్రం రాణులకే గానీ.. రాజులకు కలిసిరాదట.. ‘కాలగర్భంలో కలిసిపోవాల్సిందే’

-

కోహినూర్‌ వజ్రం గురించి మనందరికి బానే తెలుసు.. ఈ వజ్రం ప్రస్తుటం బ్రిటన్‌లో ఉంది. రాచరికానికి గుర్తుగా, వలస పాలనకు చిహ్నంగా కోహినూర్‌ వజ్రం చేతులు మారుతూ వస్తుంది. గతేడాది రాణి ఎలిజబెత్‌ 2 కన్నుమూశారు. మరణించే వరకు ఆమె కిరీటంలోనే కోహినూర్‌ వజ్రం ఉండేది. ప్రత్యేక సందర్భాల్లో ఆమె దాన్ని ధరించేవారు.. రాణి మరణం తరువాత ఆమె కుమారుడు కింగ్‌ ఛార్లెస్‌-3(king charles) పట్టాభిషిక్తుడు కానున్నాడు. విక్టోరియా మహారాణి కోహినూర్‌ గురించి రాసిన వీలునామా ప్రకారం ఛార్లెస్‌ భార్య, బ్రిటన్‌ రాణి కెమిల్లా దానిని ధరించాల్సి ఉంటుంది. కానీ కెమిల్లా తన కిరీటంలో కోహినూర్‌ను పోలిన మరో వజ్రం ధరిస్తారని ఇటీవల బకింగ్‌హాం ప్యాలెస్‌ వర్గాలు తెలిపాయి. చరిత్రలో కోహినూర్‌ ధరించిన రాజులందరూ చరిత్రలోనే కలిసిపోయారు. అందుకే ఛార్లెస్‌-3, కెమిల్లా కోహినూర్‌ను దూరం పెడుతున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి.

Kohinoor: History, journey and price of India's famous diamond! | India.com

గుంటూరు జిల్లాలో కోహినూర్‌ పుట్టుక

కోహినూర్ పుట్టుక గురించి అనేక ఊహాగానాలు నేటికి చలామణి అవుతున్నాయి…చాలా మంది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కొల్లూరులో తొలిసారి కోహినూర్‌ దొరికిందని చెబుతారు. అప్పుడు దాని బరువు గురించి కచ్చితమైన రికార్డులు లేవు. ప్రస్తుతం కోహినూర్‌ 105.6 క్యారెట్లు ఉంది. ఈ వజ్రం కాకతీయుల ఆధీనంలో ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు.

విక్టోరియా వీలునామా

కోహినూర్‌ చరిత్రలో దానిని ధరించిన లేదా తమ వద్ద దాచుకున్న రాజులందరూ కాలగర్భంలో కలిసిపోయారట. దాంతో విక్టోరియా జాగ్రత్తపడింది. అరుదైన సందర్భాల్లో మాత్రమే దానిని ధరిస్తూ వచ్చేవారు…మహారాణులు మాత్రమే ఈ వజ్రాన్ని ధరించాలంటూ ఆమె వీలునామా కూడా రాసిందంటే అది నిజమే అయి ఉంటుంది.. ఒక వేళ రాజు పాలిస్తుంటే అతడి భార్యగా రాణికి ఆ వజ్రాన్ని ధరించే హక్కుంటుందని ఆ విలునామాలో పేర్కొంది. విక్టోరియా తరువాత దాన్ని క్వీన్‌ అలెగ్జాండ్రా, క్వీన్‌ మేరీ, క్వీన్‌ ఎలిజబెత్‌-2తమ కిరీటంలో ధరించారు. ప్రస్తుతం కోహినూరు వజ్రం టవర్‌ ఆఫ్‌ లండన్‌ వద్దనున్న జువెల్‌ హౌస్‌లో ఉంది. ఈ వజ్రం మాకు ఇవ్వాలని భారత్‌ పలుమార్లు విజ్ఞప్తి చేసినా బ్రిటన్‌ తిరస్కరించింది. పాక్‌, అఫ్గాన్‌ దేశాలు కూడా ఈ వజ్రం తమ సొంతమని తమకే ఇవ్వాలంటున్నాయి.. మొత్తానికి కోహినూర్‌ వజ్రం చేతులు మారుతూ వచ్చింది. మరి విక్టోరియా వీలునామాలో రాసినట్లు..కోహినూర్‌ వజ్రం రాజులకు కలిసిరాకపోతే.. కింగ్‌ ఛార్లెస్‌-3 పరిస్థితి ఏంటో..!

Read more RELATED
Recommended to you

Latest news