కోహ్లీ మిషిన్ కాదు.. మనిషే..?

-

ఇటీవలే ఐపీఎల్లో కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టుతో ఓటమి తర్వాత బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పై తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ మ్యాచ్లో కోహ్లీ తీరుపై.. కెప్టెన్సీ పై కూడా విమర్శలు వస్తూనే ఉన్నాయి. తీవ్ర విమర్శల నేపథ్యంలో స్పందించిన కోహ్లీ… ఓటమికి తాను బాధ్యత వహిస్తానని అంటూ చెప్పుకొచ్చాడు. ఓడిన మ్యాచ్లో తాము చేసిన తప్పులన్నిటినీ తెలుసుకున్నాము అంటూ చెప్పుకొచ్చాడు. అయినా కోహ్లీ పై విమర్శలు మాత్రం ఆగలేదు.

అయితే తాజాగా కోహ్లీ కి అండగా నిలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కోహ్లీ చిన్ననాటి కోచ్. కోహ్లీ అందరి లాగా మనిషే అని.. ఎందుకు అందరూ అతనిని ఒక మిషిన్ లాగ చూస్తున్నారు అంటూ ప్రశ్నించాడు. ఎంత అత్యుత్తమ ఆటగాడైనా ఎప్పుడూ ఒకే లాగ రాణించాలి అంటే సాధ్యం కాదు అంటూ తెలిపిన ఆయన… ప్రతి ఆటగాడికి చెడ్డ రోజులు వస్తాయి అని చెప్పుకొచ్చాడు. అంత మాత్రానికి కోహ్లీని అంతలా టార్గెట్ చేసి విమర్శించడం సరైనది కాదు అంటూ కామెంట్ చేశాడు కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ.

Read more RELATED
Recommended to you

Latest news