టీ సర్కార్ కి షాకిచ్చిన ఆర్టీసీ యూనియన్

-

గత ఏడాది తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వానికి మధ్య భారీ యుద్ధమే జరిగింది. తెలంగాణ ఆర్టీసీని తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేయాలని చాలా రోజులు సమ్మె చేశారు ఉద్యోగులు. ఆ తరువాత హామీలు పరిశీలిస్తానని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో మళ్లీ బస్సులు రోడ్డెక్కాయి. అయితే ఆ సమయంలో ఇక ఆర్టీసీలో యూనియన్ లు ఉండకూడదని ఉన్న అన్నీ యూనియన్స్ నీ రద్దు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఒకరకంగా అప్పటి నుండే అశ్వద్ధామ రెడ్డిని టార్గెట్ చేసిందని చెప్పచ్చు.

తాజాగా ఈ విషయంలో సర్కార్ కి షాక్ ఇచ్చింది ఆర్టీసీ యూనియన్. ఈరోజు ఆర్టీసీ తెలంగాణ మజ్దుర్ యూనియన్ కేంద్ర కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశంలో అశ్వద్ధామ రెడ్డి టీఎంయూ ప్రధాన కార్యదర్శిగా కొనసాగేందుకు సంపూర్ణ మద్దతు ఇస్తూ తీర్మానం చేశారు. ప్రజాస్వామిక దేశంలో ట్రెడ్ యూనియన్ ల కార్యకలపాల అప్రకటిత నిషేధం సరికాదని ప్రభుత్వం ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లు కొనసాగేలా అనుమతి ఇవ్వాలని తీర్మానం చేశామని టీఎంయూ అధ్యక్షుడు తిరుపతి పేర్కొన్నారు. టీఎంయూ కేంద్ర కమిటీ సమావేశానికి వివిధ జిల్లాల కార్యదర్శులు, జోనల్ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news