ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ ,కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్కతా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని 16.3 ఓవర్లలోనే ఛేదించింది. ఆ జట్టు బ్యాటర్లలో సాల్ట్ 68, శ్రేయస్ అయ్యర్ 33, వెంకటేశ్ అయ్యర్ 26 రన్స్తో రాణించారు. ఈ సీజన్లో కేకేఆర్కు ఇది ఆరో విజయం కాగా, ఢిల్లీకి ఆరో ఓటమి.
ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్కి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఢిల్లీ ఓపినర్స్ పృథ్వి షా, ఫ్రేసెర్ తక్కువ పరుగుల కి అవుట్ అయ్యారు.పృథ్వి షా 7 బంతుల్లో 13 రన్స్ , ఫ్రేసెర్ 7 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేశారు. ఇక ఆ తర్వాత వచ్చిన అభిషేకు పొరేల్ 18 పరుగులు, షై హోప్ 6 పరుగులు, కెప్టెన్ పంత్ 27 పరుగులు చేసి అవుట్ అయ్యారు.అక్షర్ పటేల్ 15 రన్స్ చేయగా,స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చివర్లో 35 పరుగులు చేసి టీమ్ను ఆదుకున్నారు. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, వైభవ్ అరోరా 2, హర్షిత్ 2, నరైన్, స్టార్క్ చెరో వికెట్ తీశారు.