కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే బ్రాండ్.. పార్టీలు మారితే ఆ బ్రాండ్ పోదు – కోమటి రెడ్డి

-

కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే బ్రాండ్ అని.. పార్టీలు మారితే ఆ బ్రాండ్ పోదని కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే బ్రాండ్, వెంకట్ రెడ్డి అంటే గౌరవం ఉందన్నారు. ఇద్దరం కాంగ్రెస్ కోసం పని చేశామని.. ఇద్దరిలో ఒకరం trs లో చేరితే బ్రాండ్ పోయేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ కి ఎప్పుడు నేను వ్యతిరేకంగా పని చేయలేదని.. కెసిఆర్ పై సరిగా ఉద్యమం చేయడం లేదన్నారు.

TRS ను ఓడించడమే నా జీవిత లక్ష్యం అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్. కెసిఆర్.. ఓ సారి వచ్చి మునుగోడు నియోజకవర్గం చూడండని ఛాలెంజ్‌ విసిరారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే లు ఉన్న చోట నిధులు ఇవ్వకపోతే ఎట్లా అని నిలదీశారు. ఎందుకు వివక్ష చూపిస్తున్నావు… బఫున్ లాంటి మంత్రిని పంపించి హల్చల్ చేయిస్తున్నాడని కెసిఆర్ పై మండిపడ్డారు. యెనిమిది ఎండ్లాలో కెసిఆర్ లక్షల కోట్లు సంపాదించారని.. వచ్చే రోజుల్లో అవినీతి సొమ్ము బయటకు వస్తుందని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news