మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా 11.20 శాతం ఓటింగ్ నమోదవ్వగా.. 11 గంటల వరకు 25.8 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
ఇక అటు టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి… తమతమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ.. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఓటు వేయలేని పరిస్థితి నెలకొంది. రాజగోపాల్ రెడ్డికి అసలు మునుగోడు నియోజక వర్గంలో ఓటు హక్కే లేదని సమాచారం. రాజగోపాల్ రెడ్డికి.. నకిరేకల్ నియోజక వర్గంలోని నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలలో ఓటు హక్కు ఉందని తెలుస్తోంది. దీని కారణంగా.. మునుగోడులో తనకు తాను ఓటు వేసే హక్కు కోల్పోయాడట.