మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని బుజ్జగించేందుకు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఉత్తంకుమార్ రెడ్డి, వంశీచంద్ తో రాజగోపాల్ రెడ్డికి కబురు పంపింది అధిష్టానం. కానీ రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వచ్చేదే లేదని తేల్చి చెప్పారు. రేపటి నుండి తన నియోజకవర్గంలో పర్యటిస్తానని తెలిపారు రాజగోపాల్ రెడ్డి. అలాగే..త్వరలోనే మునుగోడు ఉప ఎన్నిక వస్తుందని సంచలన ప్రకటన చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
రాబోయే రోజుల్లో యుద్ధం ప్రకటిస్తానని.. ఇది పార్టీలకు సంబంధించిన యుద్ధం కాదు..కెసిఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలకు జరిగే చివరి యుద్ధమని పేర్కొన్నారు. ఇది ధర్మ యుద్ధం..మునుగోడు ప్రజలతో మాట్లాడతా..ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడే యుద్ధమని వెల్లడించారు.ఉపఎన్నిక కేసీఆర్ అనుకుంటే రాదు మునుగోడు ప్రజలనుకుంటే వస్తుంది..కెసిఆర్ ప్రభుత్వం దిగివచ్చి మునుగోడు అభివృద్ధి కి నిధులు వస్తాయి అనుకుంటే ఉప ఎన్నిక వస్తుందని తెలిపారు. ఈ తీర్పు తెలంగాణ రాజకీయాలను మార్చివేస్తాయి.. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..ఈ ఉపఎన్నిక యుద్ధం ద్వారా తెలంగాణ ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉందని తెలిపారు.