సినీ యాక్ట‌ర్ ను ప‌రామ‌ర్శించిన త‌ల‌సాని చిన్నారి కుంటుంబాన్నెందుకు ప‌రామ‌ర్శించ‌లేదు : కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

ఆరేళ్ళ పసికందును ఒక రాక్షసుడు రేప్ చేసి హత్య చేయడం దారుణమ‌ని కాంగ్రెస్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి అన్నారు. తెలంగాణ పరువు పోయిందన్నారు. చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించకడానికి సీఎం కెసిఆర్, దత్తత తీసుకున్న కేటీఆర్, డమ్మీ హోమ్ మంత్రి మహమూద్ అలీ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రాకపోవడం దారుణమ‌ని కోమటిరెడ్డి వ్యాక్యానించారు. నిందుతున్ని పట్టిస్తే 10లక్షలు ఇస్తామని ప్రకటించడం హాస్యాస్పదమ‌న్నారు. పోలీసులున్నది గాడిదలు కాయడానికా..?అంటూ ప్ర‌శ్నించారు. చిన్నారి మృతికి ఆ రాక్షసుడు ఎంత కారణమో పోలీసులు అంతే కారణమంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.komatireddy venkatreddy

తల్లి పిర్యాదు చేసిన వెంటనే డోర్ ఓపెన్ చేసిఉంటే అమ్మాయి బ్రతికి ఉండేదని వ్యాఖ్యానించారు. కేటీఆర్ ప్రచారాల మంత్రి, మూర్కుడు అంటూ మండి ప‌డ్డారు. బతుకమ్మ అంటూ తెలంగాణ అంతా తిరిగే కవిత ఇక్కడికి ఎందుకు రాలేదని ప్ర‌శ్నించారు. మానవత్వం ఉంటే కేటీఆర్ ఇక్కడికి రావాలన్నారు. దళిత గిరిజన బిడ్డలని రాలేదా, కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. అమ్మాయి చనిపోయి బాధలో ఉంటే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పడం బాధాకరమ‌న్నారు. చదువుకున్న కలెక్టర్ మాట్లాడే మాటలేనా ఇవంటూ ప్ర‌శ్నించారు. సినీ యాక్టర్ ని పరామర్శించే తలసాని శ్రీనివాస్ ఇక్కడికి ఎందుకురాలేద‌ని కోమ‌టి రెడ్డి ప్ర‌శ్నించారు. అయన అసలు మంత్రేనా అంటూ వ్యాక్యానించారు. దిశ టైం లో చేసినట్లే చిన్నారి విషయంలో కూడా వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.