జగన్ మరో సంచలన నిర్ణయం..రాష్ట్రంలో మటన్‌ మార్ట్‌లు !

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మటన్ మార్ట్ ల ఏర్పాటు దిశగా జగన్‌ సర్కార్ అడుగులు వేస్తోంది. ఆరోగ్యకరమైన మాంసం వినియోగం పెంచటమే లక్ష్యంగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో మార్ట్ ల ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగానే…. తొలి దశలో విశాఖ, విజయవాడల్లో నాలుగు చొప్పున ఏర్పాటు చేయనుంది జగన్‌ సర్కార్‌.

Jagan
Jagan

ఆ తర్వాత మిగిలిన కార్పొరేషన్లు, మునిసిపాల్టీ ల్లో విస్తరణ కు ఏర్పాట్లు చేయనుంది. రూ.11.20 కోట్లతో 112 మార్ట్ లు ఏర్పాటు కు సన్నాహాలు చేస్తోంది జగన్‌ సర్కార్‌. పరిశుభ్రమైన వాతావరణం లో రిటైల్ అవుట్స్ ఉండేలా యోచిస్తోంది జగన్‌ సర్కార్‌. దశల వారీ గా మిగిలిన ప్రాంతాలకు విస్తరించాలని జగన్‌ సర్కార్ కసరత్తు చేస్తోంది. తొలి దశలో విజయ వంతం అయిన అనంతరం… రాష్ట్ర వ్యాప్తం గా ఇదే పద్దతి కొనసాగించాలని డిసైడ్‌ అయింది.