100 మందిని చంపేసిన కొరియా, మామూలోడు కాదు గురూ…

-

ఉత్తరకొరియా లో కరోనా కేసుల విషయంలో ఇప్పుడు అనేక అనుమానాలు ఉన్నాయి. చైనాకు, రష్యాకు, దక్షిణ కొరియా కు సరిహద్దుల్లో ఉన్నా సరే అక్కడ కరోనా కేసులు ఎందుకు పెరగడం లేదు అనేది ఎవరికి అర్ధం కావడం లేదు. కరోనా కేసులు అక్కడ ఒక్కటి కూడా లేవు అనే దాని మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అనుమానం వ్యక్తం చేస్తుంది. దీనిపై అమెరికా నిఘా విభాగం ఆరా తీసినట్టు తెలుస్తుంది.

అక్కడ కరోన వచ్చింది అని నిర్ధారణ అయితే ఆర్మీ లో ఒక ప్రత్యేక విభాగాన్ని నియమించారని వాళ్లకు సమాచారం చేస్తారని… వాళ్ళు వచ్చి ఎవరూ లేని ఎడారి లేదా కొండ ప్రాంతంలో కాల్చి చంపెస్తున్నట్టు అమెరికా గుర్తించింది. 11 రోజుల్లో 100 మందిని ఉత్తరకొరియా సైన్యం కాల్చి వేసినట్టు సమాచారం. జపాన్ నుంచి వచ్చే వారి మీద పూర్తిగా ఆంక్షలు విధించినట్టు తెలుస్తుంది. అమెరికా అధికారులు కూడా… ఈ పరిస్థితిని చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నా చైనాకు భయపడి కొరియా నిజాలు బయటపెట్టడం లేదని, కొరియా లో కేసులు లేవు అనే మాట అబద్దం అని… అక్కడ విస్తారంగా కొండ ప్రాంతాలు ఉన్నాయని అక్కడ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అనేది స్పష్టత లేదు గాని చైనాకు సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్లో ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయని వచ్చిన వాళ్ళను వచ్చినట్టు చంపేస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news