కొత్తిమీర లేకుండా ఏ మసాల వంటకూడా వండలేరేమోకదా..అసలు కొత్తిమీర వేసేది లాస్ట్ లో అయినా..అది ఇచ్చే రుచి మాములుగా ఉండదు. ఔషధ గుణాలున్న కొత్తిమీర మనస్సును, ఆహార రుచిని పెంచుతుంది. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్సరస్, పొటాషియం, సోడియం వంటి ఖనిజాలు ఏన్నో ఉంటాయి. అలాగే విటమిన్లు ఏ, బీ, సీ, కే వంటి పోషకాలు పుష్కలంగా కొత్తిమీరలో ఉన్నాయి. అయితే ఈ కొత్తిమీరను వాడటం వల్ల ఆరోగ్యాన్ని ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం..
కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తర్వాత ప్రజల్లో రోగనిరోధక శక్తిపై అవగాహన పెరుగుతుంది. కొత్తిమీరలో ఉండే ఆక్సికోడోన్ ఫ్రీ రాడికల్స్ వల్ల సెల్యులార్ నష్టాన్ని తగ్గిస్తుంది. టోకోఫెరోల్స్ రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
గుండె జబ్బు ప్రమాదం..
గుండె సమస్యలకు ప్రస్తుతం కాలంలో ఎక్కువై పోయాయి. ఒకప్పుడు అంటే ఒక ఏజ్ వాళ్లకు మాత్రమే వస్తాయని నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా గుండె రక్షణ గురించి ఆలోచించాల్సిన తరుణంలో మనం ఉన్నాం. కొత్తిమీర డైయూరిటిక్‌గా పనిచేస్తుంది. శరీరంలో సోడియంను బయటకు పంపి రక్తపోటును తగ్గించడంలో ఇది ప్రముఖపాత్ర పోషిస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్, ఎల్‌డీఎల్‌ఐని కూడా తగ్గిస్తుంది.
కణితి పెరుగుదల..
శరీరంలో మంటను తగ్గించే శక్తి కొత్తిమీరకు ఉంది. ఎందుకంటే, కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కేన్సర్ వచ్చినపుడు కొత్తిమీర తింటే.. కణాల అధిక పెరుగుదలను తగ్గించే లేదా మందగించే శక్తి వాటికి ఉంటుంది.
రోగనిరోధక శక్తి..
కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తర్వాత ప్రజల్లో రోగనిరోధక శక్తిపై అవగాహన పెరుగుతుంది. కొత్తిమీరలో ఉండే ఆక్సికోడోన్ ఫ్రీ రాడికల్స్ వల్ల సెల్యులార్ నష్టాన్ని తగ్గిస్తుంది. టోకోఫెరోల్స్ రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
రక్తంలో చక్కెర స్థాయి..
కొత్తిమీర గ్లూకోజ్‌నుసమర్థవంతంగా ప్రాసెస్ చేయడంలో సహాయపడే ఎంజైమ్‌లను సక్రియం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని ఇటీవలి అధ్యయనాలు చూపిస్తున్నాయి.
జీర్ణక్రియ, పేగు ఆరోగ్యం..
కొత్తిమీర ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు ప్రోత్సహిస్తుంది. ఐబీఎస్ ఉన్న రోగులకు కొత్తిమీరతో కూడిన మూలిక ఔషధం 30 చుక్కలు ఇవ్వడం వల్ల పొత్తికడుపు నొప్పి, ఉబ్బరం, అసౌకర్యం గణనీయంగా తగ్గుతుందని ఓ అధ్యయనం కనుగొంది. మజ్జిగలో కొత్తిమీర వేసుకుని తాగటం ద్వారా కూడా మలబద్ధకం సమస్య పోతుంది.
మెదడు ఆరోగ్యం..
పార్కిన్సన్స్, అల్జీమర్స్, మల్లీపుల్ స్కెర్లోసిస్ వంటి మెదడు వ్యాధుల వాపుతో సంబంధం కలిగి ఉంటాయి. కొత్తిమీరను తీసుకోవడం ద్వారా ఈ మూడు వ్యాధులను నివారించుకోవచ్చు. కొత్తిమీర రసం నరాల కణాల దెబ్బతినకుండా కాపాడుతుందని అధ్యయనంలో తేలింది. కొత్తిమీర జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.