కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్స్ కి ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. తాజాగా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్స్ ని అలర్ట్ చేసింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… బ్యాంకు డెబిట్ కార్డ్ సేవలకు వచ్చే వారం అంతరాయం కలిగే వుంది అని ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ అంది.
అంటే 31 జనవరి, 2022 సోమవారం నాడు ఉదయం 1.00 గంటల నుంచి తెల్లవారుజామున 4.00 గంటల వరకు బ్యాంక్ సిస్టమ్స్ మెయింటెనెన్స్ యాక్టీవిటీలో ఉంటాయి అని చెప్పింది బ్యాంక్. ఈ కారణం వల్లనే సేవలకు అంతరాయం కలుగుతుందని కోటక్ మహీంద్రా అధికారిక ప్రకటన కూడా చేసింది. కస్టమర్లకు అలర్ట్ మెసేజ్లని ఈ మేరకు పంపింది బ్యాంక్.
ఇది ఇలా ఉంటే ఈ సమయం లో కోటక్ బ్యాంక్ డెబిట్ కార్డ్‌లో పలు సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని కూడా తెలియజేయడం జరిగింది. ATM, POS, ECOM, QR, చెల్లింపు టోకనైజేషన్, కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ, PIN ప్రమాణీకరణ & PIN జనరేషన్, కార్డ్ బ్లాక్ చేయడం వంటి సేవలు ఈ సమయం లో అవ్వవు అని కోటక్ మహేంద్ర బ్యాంక్ కస్టమర్స్ తెలుసుకోవాలి. కనుక ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే ముందే పూర్తి చేసుకోవడం మంచిది.