అమ్మా.. క్వారంటైన్లో ఉండటం వల్ల నీ ఆశీస్సులు తీసుకోలేకపోతున్నా: చిరంజీవి

-

ఇవాళ మెగాస్టార్ చిరంజీవి తల్లి పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేశారు. “అమ్మా !జన్మదిన శుభాకాంక్షలు క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా.. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ.. అభినందనలతో …. శంకరబాబు:” మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. కాగా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఆయన సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ రోజు తన మాతృమూర్తి పుట్టినరోజు సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఇలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. ఆయనను తల్లి ప్రేమగా శంకర బాబు అంటూ పిలుచుకుంటారు. అందుకే తన తల్లికి శుభాకాంక్షలు తెలిపే క్రమంలో తన పేరును ఆయన శంకర్ బాబు అని కూడా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news