సజ్జల..ఓ షాడో ముఖ్యమంత్రి – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

-

సజ్జల..ఓ షాడో ముఖ్యమంత్రి అని నెల్లూరు రూరల్ ఎం.ఎల్.ఏ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్‌ కామెంట్స్ చేశారు. నగర వై.సి.పి.అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర రావు తో.పాటు రఘు..జావేద్ లను అరెస్ట్ చేశారని.. షాడో ముఖ్యమంత్రి సజ్జల ఆదేశాల మేరకే ఈ అరెస్టులు జరుగుతున్నాయని ఫైర్‌ అయ్యారు. అన్ని అంశాలు వదిలి నెల్లూరు రూరల్ పై సజ్జల దృష్టి పెట్టారని..అరెస్ట్ ల పై పోలీసులు సరైన సమాచారం ఇవ్వలేదని తెలిపారు.


నేను వేదాయపాలెం స్టేషన్ కు వెళ్లగా…అక్కడ వెంకటేశ్వర రావు లేకపోవడంతో పోలీసులను నిలదీశానని… 24 గంటల్లో న్యాయస్థానంలో ప్రవేశ పెడతామని డి.ఎస్.పి.హామీ ఇవ్వడంతో నిరసన విరమించానని తెలిపారు. నేతల అరెస్ట్ చేసిన తీరు సరికాదని..హై వే పై ..రాత్రి 11 .30 గంటల వరకూ తిప్పారని మండిపడ్డారు. సజ్జల ఆదేశాలను పోలీసులు అమలు చేస్తున్నారని..నన్ను మానసికంగా విధించాలని..చూస్తున్నారన్నారు. నా అనుచరులు ఎవరూ భయ పడరు…నా డ్రైవర్ కూడా పట్టించుకోడని..విద్యార్థి దశ లోనే ఆన్నీ చూసానని తెలిపారు. నోటీస్ లు ఇవ్వకుండా భయభ్రాంతులు చేసే రీతిలో అరెస్ట్ చేయడం సరికాదన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news