బేబీ బంప్ ఫోటోల్లో బాబీ డాల్ లా మెరిసిపోతున్న పూర్ణ..

-

టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి పూర్ణ. కొన్ని సినిమాల్లోనే నటించిన ఎంతో హోమ్లీగా కనిపిస్తూ అభిమానుల్ని ఆకట్టుకున్నారు. గత ఏడాది దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సెటిలైపోయిన పూర్ణ త్వరలోనే తల్లి కాబోతున్నారు. ఈ సందర్భంగా తాను బేబీ పంపుతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు..నటి పూర్ణ గత ఏడాది జూన్ లో దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త శానిద్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అన్ని విషయాల్ని పంచుకుంటూ వస్తున్నారు..

Actress Poorna: న్యూ ఇయర్‌ వేళ గుడ్‌న్యూస్ చెప్పిన ప్రముఖ నటి.. త్వరలోనే  తల్లిగా ప్రమోషన్‌ పొందనున్న పూర్ణ | Actress Poorna announces her pregnancy  with special video Telugu ...

పూర్ణ తన పెళ్లికి సంబంధించిన విషయాలను భర్త, ప్రెగ్నెన్సీ విషయాలను ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వస్తున్నారు. తాజాగా తన శీమంతానికి సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే ఇప్పుడు బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను షేర్ చేసి వావ్ అనిపించారు..ఈ ఫోటోల్లో బేబీ బంప్ చూపిస్తూ లాంగ్ పింక్ గౌన్ లో మెరుపులు మెరిపించింది పూర్ణ. చూడముచ్చటి ఫోజుల్లో అందరినీ ఆకట్టుకున్నారు. అలాగే తన కడుపులో పెరుగుతున్న బిడ్డపై ఉన్న ప్రేమను చూపిస్తూ ఒక ఎమోషనల్ కోట్ ను ఉంచారు. లైఫ్ లో జరిగే అతిపెద్ద మిరాకిల్ ఏంటంటే మన లోపల ఇంకా లైఫ్ పెరగటం అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె అభిమానులంతా ఈ ఫోటోలు చూసి కామెంట్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news