కొత్తపేటలో దేశంలోనే ఎత్తైన సర్కార్ దవాఖానా

-

హైదరాబాద్‌లో కొత్తపేట పండ్ల మార్కెట్‌ స్ధలంలో నిర్మిస్తున్న టిమ్స్‌ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) దేశంలోనే ఎత్తయిన ప్రభుత్వ ఆస్పత్రిగా నిలవనుంది. ఈ ఆసుపత్రిని 123 మీటర్ల ఎత్తు.. 27 అంతస్తుల్లో నిర్మించనున్నారని తెలిసింది. 11.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ దవాఖానా రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం.

దేశంలో ప్రైవేటులోనూ ఇంత ఎత్తైన ఆస్పత్రి లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. సంబంధిత భవన నమూనా ఒకటి తాజాగా బయటకు వచ్చింది. రూ.668 కోట్ల వ్యయంతో ఈ ఆసుపత్రి నిర్మాణ టెండరును ఇటీవల ఎల్‌ అండ్‌ టీ దక్కించుకున్న విషయం విదితమే. టిమ్స్‌ పేరుతో ఎల్బీనగర్‌తో పాటు అల్వాల్‌, సనత్‌నగర్‌లలో ఒక్కోటి వేయి పడకల సామర్థ్యంతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news